- Advertisement -
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మావోలు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మావోలు ప్రతిదాడి చేసేందుకు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన ఆరుగురు మావోల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎకె-47, ఎస్ఎల్‌ఆర్ రైఫిల్స్, కొన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
- Advertisement -