- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ ప్రాంతం పూంచ్‌లో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రత బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పూంచ్ ప్రాంతంలోని జెన్‌లో కంచె వెంబడి బుధవారం అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తుల కదలికలను భద్రతా బలగాలు గుర్తించాయి. తొలుత భద్రతా బలగాల వినికిడి రావడంతో తీవ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అపరేషన్ మహాదేవ్ ద్వారా పహల్గాంలో పాల్గొన్న ముగ్గురు తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. పహల్గాం దాడికి పాల్పడిన సులేమాన్‌తో పాటు అతడి ఇద్దరు అనుచరులు హతమయ్యారు.
- Advertisement -