Wednesday, August 13, 2025

ఫాక్స్‌సాగర్‌లో ఆక్రమణలు భద్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: చెరువులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే తమ పలుకుబడితో వాటిని కబ్జాచేస్తే…రక్షించాల్సిన అధికారులే వారికి అండగా నిలబడితే…అక్కడ చెరువులుండవు ..రికార్డుల్లోనే ఉంటాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని అనేక చెరువులు బడాబాబుల చెరలో చిక్కి మాయమైన విషయం బహిరంగ రహస్యమే. ఇదే క్రమంలో ఓ మాజీ మంత్రి తనయు డు చారిత్రక చెరువుపై కన్నేసి యథేచ్ఛగా ఆక్రమణలు చేపట్టి ఉరి బిగించాడు. అడ్డుకోవల్సిన అధికార యంత్రాంగాలు సదరు మా జీ మంత్రి పలుకుబడికి తలొగ్గి చేతులెత్తేయడంతో చెరువు భూ మూల్లో అపార్టుమెంట్లను నిర్మించడం గమనార్హం. సామాన్యులపై ప్రతాపాన్ని చూపే ‘హైడ్రా’ కూడా ఇటువైపుగా చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జి ల్లా దుండిగల్ మండలం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఫాక్స్ సాగర్ చెరువు కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల, దుండిగల్, గండి మైసమ్మ మండలం దూలపల్లి, కొంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో విస్తరించి ఉంది. మొత్తం 462 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ చెరువు జలాశయం ఉంటుంది. 2013లో చెరువు ఫుల్ ట్యాం క్ లెవెల్, బఫర్ జోన్ ప్రాంతాలు సర్వే చేయబడి వాటికి హద్దులు గుర్తించారు.

చెరువు సర్వె నెంబర్: 151, 179/సీ గుర్తింపు ఉం ది. ముందస్తు వ్యూహాం ప్రకారం చెరువులు,సర్కారు భూముల సమీపంలోనే భూములు కొని వాటిని కబ్జాచేయడంలో సిద్దహస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మాజీ మంత్రి చెరువుపై కన్నేసి స్వాహా పర్వానికి తెరలేపారు. అధికారంలో ఉన్నప్పుడు తన పలుకుబడితో తనయుడి పేరిట ఉన్న భూముల్లో నిర్మాణాలకు అనుమతులను ఇప్పించి దగ్గరుండి నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిలో ఉన్న ఆయన తన భూములన్నిటికీ క్రమబద్దీకరణ చేసుకొని అవసరమున్న చోట అనుమతులు ముందే పొంది చకా చకా నిర్మాణాలను ప్రారంభించాడు. అందులో భా గంగానే ఫాక్స్‌సాగర్ చెరువు పక్కనే ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న భూముల్లో నిర్మాణాలకు అనుమతులు చకచకా తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీ షిరిడి సాయి బిల్డర్స్  సంస్థ ఫాక్స్ సాగర్ చెరువు పరిధిలో అపార్ట్మెంట్ నిర్మాణానికి ప్రమాణాలు ఉల్లంఘించి అనుమతులు పొందిందని సమాచారం. 2013లోనే చెరువు మరియు చుట్టు పక్కల ప్రాంతాల గుర్తింపు సర్వేలు ఉన్నాయి. ఇలా అవాస్తవ నివేదికలను సమర్పించి అనుమతులను పొందినట్లు తెలుస్తోంది.

నిర్మాణ సంస్థ ఎవరు ?
శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ సంస్థకు చెందిన అపార్టుమెంటు నిర్మాణాలు పూర్తిచేసుకుని అమ్మకానికి సిద్ధం అయ్యింది. ఈ సంస్థకు అట్టి భూ యాజమాని మాజీ మంత్రి, కుమారుడు. 2022లో తన తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో అనుమతులు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఎ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల నిఘా లేకుండా, ఏర్పాటు చేసిన రెవెన్యూ రికార్డులు, గూగుల్ కో-ఆర్డినేట్స్, 2014లో జరిగిన సరైన సర్వేలను పట్టించుకోకుండా గుడ్డిగా తయారు చేసిన నివేదికల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘిచారని, ఇరిగేషన్ అధికారుల ఎన్వోసీ, హెచ్‌ఎండీ అధికారుల అనుమతులు ఇచ్చారని తెలిసింది.
ఇటువైపు చూడని ‘హైడ్రా’
చారిత్రక ఫాక్స్‌సాగర్‌ను కుదించి అక్రమ నిర్మాణాలు చేపట్టినా హైడ్రా ఇటువైపుగా చూడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అక్రమ నిర్మాణాలంటూ సామాన్యులపైనే హైడ్రా విరుచుకుపడుతుందని…బడాబాబుల జోలికి వెళ్లడంలేదని మండిపడుతున్నారు. ఫాక్స్ సాగర్‌లో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఎందుకు చర్యలు చేపట్టడంలేదని ప్రశ్నిస్తున్నారు.

అపార్టుమెంట్ నిర్మాణాలపై చర్యలు చేపట్టండి
ఇరిగేషన్ అధికారులు కళ్ళు మూసుకొని నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చిన అనుమతుల కారణంగా అక్కడ వరద ముప్పు, నివాస ప్రాంతాలకు హాని ఉందని ఈ అపార్ట్మెంట్ నిర్మాణ ప్రాంతం చెరువు ఎస్టీఎల్, బఫర్ జోన్ ఉన్నందున అపార్టుమెంట్ నిర్మాణం కారణంగా వరద ప్రవాహాలను అడ్డుకుని, కాలనీలు, నివాస ప్రాంతాలకు పర్యావరణ ప్రమాదం తప్పదంటూ సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఫాక్స్ సాగర్ చెరువులో వరదలు వచ్చినప్పుడు పరిసర ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని , భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించేందుకు నిబంధనలకు ఉల్లంగించిన ఇలాంటి బిల్డర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గతవారం కొంపల్లి మున్సిపల్ కార్యాలయం, దుండిగల్ తహసీల్ కార్యాలయాల్లో అధికారులకు కూడ ఫిర్యాదు చేశారు. భవనం పక్కన ఉన్న వాటర్ బాడీని చెరువుగా రికార్డుల్లో ఉంచి, నాలాగా పేర్కొని తప్పుదారి నివేదికల ద్వారా అనుమతులు పొందినట్లు అధికారులకు ఫిర్యాదుదారుడు వివరించాడు. అక్రమ నిర్మాణాన్ని తొలగించడమేకాక, భూ యజమాని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News