Monday, July 14, 2025

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

- Advertisement -
- Advertisement -

లండన్: లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జేమీ స్మిత్(8)ను వాషింగ్టన్ సుందర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 164 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు 6వ వికెట్ కోల్పోయింది. అంతకుముందు అర్థ సెంచరీకి చేరువైన జో రూట్()ను కూడా సుందర్ పెవిలియన్ కు పంపించి భారత్ కు బ్రేకిచ్చాడు. ఇక, నాలుగో రోజు టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో క్రిస్ వోక్స్ (8), బెన్ స్టోక్స్ (27) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 175 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బౌలింగ్‌లో సిరాజ్, సుందర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, నితీశ్ చెరో వికెట్ తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News