Sunday, July 27, 2025

నాలుగో రోజు ముగిసిన ఆట.. పోరాడుతున్న గిల్, రాహుల్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో రెండు కీలక వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శుభ్ మన్ గిల్(78), కెఎల్ రాహుల్(87)లు ఉన్నారు. భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 669 పరుగుల భారీ స్కోరు సాధించి.. 311 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. జో రూట్(150), బెన్ స్టోక్స్(141) భారీ శతకాలతో విజృంభించారు. వీరితోపాటు ఓపెనర్లు జాక్ క్రాలీ(84), డకెట్(94), పోప్(71)లు అర్థ సెంచరీలతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 669 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 310 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ తొలి ఓవర్ లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0), సాయి సుదర్శన్(0)లను ఔట్ చేసి భారత్ ను దెబ్బ కొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్ తో కలిసి మరో వికెట్ పడకుండా కెఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మొదట అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. తర్వాత రాహుల్ హాఫ్ సెంచరీ సాధించారు. ఆ తర్వాత కూడా ఇంగ్లాండ్ బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయి భారత్ కు 174 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరుద్దరు రాణించడంతో టీమిండియా ప్రస్తుతం మెరుగైన స్థితిలో నిలిచింది. ఇక, రేపు చివరి రోజు కావడంతో మ్యాచ్ ను డ్రాగా ముగించేందుకు భారత్ ప్రయత్నించే అవకాశం ఉండగా.. టీమిండియాను త్వరగా ఆలౌట్ చేస్తే విజయం సాధించొచ్చని ఇంగ్లాండ్ భావిస్తోంది. మరి రేపు, భారత బ్యాట్స్ మెన్స్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News