- Advertisement -
ఐదో చివరి టెస్టులో టీమిండియా, ఇంగ్లాండ్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్లు రాణించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(118) సెంచరీతో చెలరేగాడు. ఆకాశ్ దీప్(66), జడేజా(53)లు అర్ధ శతకాలతో మెరవగా.. ధ్రువ్ జురెల్(34) పర్వాలేదనిపించాడు. ఇక, చివర్లో వాషింగ్టన్ సుందర్ సిక్సులతో మెరపులు మెరిపించాడు. వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులతో కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మరో భారీ షాట్ ఆడబోయి సుందర్(53) ఔటయ్యాడు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లాండ్ కు భారత్ 374 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
- Advertisement -