Tuesday, July 15, 2025

భారత్‌పై ఇంగ్లండ్ గెలుపు

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి అభిమానులను నిరాశకు గురి చేసింది. బ్యాటింగ్ వైఫల్యం భారత్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లింది. ఇంగ్లండ్ విధించిన 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదించలేక పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కీలక ఆటగాళ్లందరూ చేతులెత్తేశారు. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు తప్పిస్తే మిగతా వారు పూర్తిగా తేలిపోయారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ లార్డ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో (0)కే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా రెండు ఇన్నింగ్స్‌లలో నిరాశ పరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో (16), రెండో ఇని్ంనగ్స్‌లో (6) పరుగులు మాత్రమే చేశాడు.

కరుణ్ నాయర్ మరోసారి తేలిపోయాడు. జట్టుకు అండగా నిలుస్తాడని భావిస్తే 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లలో కూడా నాయర్ ఘోర వైఫల్యం చవిచూశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, సుందర్‌లు కూడా విఫలమయ్యారు. పంత్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. సుందర్ ఖాతా కూడా తెరవలేక పోయాడు. జడేజా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న జడేజా 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నితీశ్‌కుమార్, బుమ్రా, సిరాజ్‌లతో కలిసి జడేజా భారత్‌ను గెలిపించేందుకు చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. టాప్ ఆర్డర్‌లో ఒకరిద్దరూ రాణించినా మ్యాచ్‌లో ఫలితం మరో విధంగా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News