- Advertisement -
బర్మింగ్‌హామ్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో (India VS England) జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హెడ్డింగ్లే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. ఇక వర్క్‌లోడ్ కారణంగా బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో పేసర్‌గా ఆకాశ్‌దీప్‌ని జట్టులోకి తీసుకున్నారు. ఇక తొలి టెస్ట్ మ్యాచ్‌లో విఫలమైన సాయి సుదర్శన్‌ని పక్కన పెట్టి.. నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు కల్పించారు. పేసర్ శార్ధూల్ ఠాకూర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
- Advertisement -