Friday, August 1, 2025

లంచ్ బ్రేక్: తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌దే పైచేయి..

- Advertisement -
- Advertisement -

లండన్: కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ (Ind VS Eng) తడబడుతోంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 4వ ఓవర్‌లోనే జైస్వాల్ వికెట్‌ని కోల్పోయింది. అట్కిన్సన్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి జైస్వాల్(2) ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి కెఎల్ రాహుల్ భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. అయితే 38 పరుగుల జట్టు స్కోర్ వద్ద రాహుల్(14) క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 23 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజ్‌లో సుదర్శన్(25), గిల్(15) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News