Wednesday, July 9, 2025

మూడో టెస్ట్‌కి ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. నాలుగేళ్ల తర్వాత అతనికి చోటు

- Advertisement -
- Advertisement -

లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా గురువారం (జూన్ 10) నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ప్రస్తుతానికి ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1గా సమం చేశాయి. దీంతో మూడో టెస్ట్‌లో గెలిచి వారికి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌తో తలపడే ఇంగ్లండ్ తుది జట్టును (England Team) ప్రకటించారు.

దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత జట్టులోకి జోఫ్రా ఆర్చర్‌ని జట్టులోకి (England Team) తీసుకున్నారు. యువ పేసర్ జోష్ టంగ్ స్థానంలో ఆర్చర్ జట్టులోకి వచ్చాడు. రెండో టెస్ట్‌కే ఆర్చర్ అందుబాటులోకి వచ్చినా.. ఫిట్‌నెస్ కారణంగా అతన్ని జట్టులోకి తీసుకోలేదు. ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉండటంతో అతనికి జట్టులో చోటు కల్పించాడు. 2021లో ఆర్చర్ చివరిసారిగా ఇంగ్లండ్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. దాదాపు 52 నెలల తర్వాత అతను మళ్లీ టెస్ట్ జెర్సీలో కనిపించనున్నాడు. ఆర్చర్ జట్టులోకి రావడంతో టీం ఇండియా ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్‌ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News