లండన్: లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ (Ind VS Eng) ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. ఈ ఇన్నింగ్స్‌ని సున్న పరుగుల ఆధిక్యంతో ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు లంచ్ సమయానికి 98 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొంత సమయానికే సిరాజ్ భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. అతని బౌలింగ్‌లో బెన్ డకెట్ (12) బుమ్రాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత 42 పరుగుల జట్టు స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో పోప్(4) ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ వెంటనే నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో క్రాలే(22) జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 87 పరుగుల జట్టు స్కోర్ వద్ద బ్రూక్‌ని ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. భారత (Ind VS Eng) బౌలింగ్‌లో సిరాజ్ 2, ఆకాశ్ దీప్, నితీశ్ తలో వికెట్ తీశారు.