Saturday, July 26, 2025

లంచ్‌ బ్రేక్: వికెట్ల తీయలేక భారత బౌలర్ల తిప్పలు..

- Advertisement -
- Advertisement -

మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా భారత్ జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు ఇంగ్లండ్‌ బ్యాటర్లు రూట్, పోప్‌లు భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బౌలింగ్‌లో ఎన్ని మార్పులు చేసిన భారత (Ind VS Eng) బౌలర్లు వికెట్ తీయలేకపోతున్నారు. మూడో రోజు 225/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. భారత బౌలర్లు రూట్, పోప్‌లు ఔట్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో రూట్ (63), పోప్‌(70)లు అర్థ శతకాలు నమోదు చేశారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 135 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. దీంతో మూడో రోజు భోజన విరామం సమయానికి 74 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 332 పరుగులు చేసింది. లీడ్‌లోకి రావాలంటే.. ఇంగ్లండ్‌కు ఇంకా 26 పరుగులు కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News