Wednesday, July 16, 2025

నాలుగో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు.. 8 ఏళ్ల తర్వాత అతనికి చోటు

- Advertisement -
- Advertisement -

లార్డ్స్ మైదానంలో భారత్‌పై విజయం సాధించి ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లండ్ (England Team). తాజాగా నాలుగో టెస్ట్‌ కోసం 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులోకి ఎనిమిదేళ్ల తర్వాత ఎడమచేతి వాటం స్పిన్నర్ లియామ్ డాసన్ తిరిగి వచ్చాడు. లార్డ్స్‌లో గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో లియామ్‌ని జట్టులోకి తీసుకున్నారు.

బషీర్ చేతి వేలికి గాయం కావడంతో అతను మిగితా రెండు టెస్టులకు దూరమైనట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. 2017లో లియామ్ డాసన్ చివరిసారిగా ఇంగ్లండ్ (England Team), దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ప్రస్తుతం అతను దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండటంతో అతన్ని జట్టులోకి తీసుకున్నారు. ఇతర బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు. కాబట్టి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడు టెస్ట్‌లలో విఫలమైన జాక్ క్రాలీకి మళ్లీ అవకాశం ఇచ్చారు. అలాగే జట్టులో భాగంగా ఉన్న జేమీ ఓవర్టన్, సామ్ కుక్‌లు తిరిగి కౌంటఈ క్రికెట్ ఆడేందుకు వాళ్లను రిలీజ్ చేశారు. భారత్‌, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.

నాలుగో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు
బెన్‌ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్ , హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News