భారత మహిళ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో టీం ఇండియా టి-20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐదు టి-20ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ జూలై 12న ముగుస్తుంది. జూలై 16 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ (England Women Team) ప్రకటించింది. ఎకిల్‌స్టోన్, మైయా బౌచియర్ తిరిగి వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు.
ఇంగ్లండ్ జట్టు (England Women Team): నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), ఎం ఆర్లాట్, టామీ బ్యూమంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ కాప్సే, కేట్ క్రాస్, ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫి ఎకిల్‌స్టోన్, లారెన్ పైలర్, అమీ జోన్స్ , ఎమ్మా లాంబ్, లిన్సే స్మిత్.
ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు వన్డేల్లో తలపడనున్నాయి. తొలి వన్డే సౌతాంప్టన్ వేదికగా జూలై 16న, రెండో వన్డే లార్డ్స్ వేదికగా జూలై 19న, మూడో వన్డే చెస్టర్-లే-స్ట్రీట్ వేదికగా జూలై 22న జరుగనుంది.