లండన్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఓవెల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (Ind VS Eng) మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలిచి తీరాలి. జరిగిన నాలుగు టెస్టుల్లో ఇంగ్లండ్ 2 మ్యాచుల్లో, భారత్ 1 మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. సిరీస్ డ్రా అవుతుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే.. సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగిస్తాడని అంతా భావించాడు. కానీ. కొంచెం ఆలస్యమైన మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో (Ind VS Eng) ఇంగ్లండ్ బెన్‌స్టోక్స్‌కి విశ్రాంతి ఇచ్చి కెప్టెన్సీ బాధ్యతలను ఒలీ పోప్‌కి అప్పగించారు. ఇక భారత్ నాలుగు మార్పులతో ఈ మ్యాచ్ బరిలో దిగుతోంది. పంత్, శార్దూల్, అన్షుల్, బుమ్రాల స్థానంలో జురేల్, కరుణ్, ప్రశిద్ధ్, ఆకాశ్‌దీప్ జట్టులోకి వచ్చారు.
ఐదో టెస్ట్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -