Wednesday, August 20, 2025

నాగా ఒప్పందంపై తాత్సారం దేనికి?

- Advertisement -
- Advertisement -

ఈశాన్య భారతంలోని నాగాలాండ్ లో తిరుగుబాటును పరిష్కరించేదిశగా 3015 ఆగస్టు 3న భారత ప్రభుత్వం, నేషనల్ సోషలిస్ట్ ఆఫ్ నాగలిమ్(ఇనాక్-మయినా) (ఎన్‌ఎస్ సిఎన్-ఐఎం) మధ్య సంతకాలు జరిగిన ఫ్రేమ్ వర్క్ ఒప్పందం ఓ చరిత్రాత్మక ముందడుగు. భారతదేశంలో చాలా దీర్ఘకాలం పాటు సాగిన అంతర్గత సంఘర్షణల్లో ఒకటైన దీనికి శాంతియుత, సమగ్ర పరిష్కారాన్ని వాగ్దానం చేస్తూ, స్వతంత్ర ప్రతిపత్తి, నాగా గుర్తింపు డుమాండ్ల ను పురిష్కరించడం ఈ ఒప్పందం లక్ష్యం. అయితే, ఈ ఫ్రేమ్ వర్క్ అగ్రమెంట్, 2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 తో కలిపి అమలు కాకపోవడం, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదాతో కూడిన ఒప్పందాలను గౌరవించడంలో భారత ప్రభుత్వం నిబద్ధత పై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ఈ వ్యాసం నాగా ఫ్రేమ్ వర్క్ ఒప్పందం లో చిక్కులు, దాని అమలులో లోపాలు, ఆర్టికల్ 370 రద్దుతో దాని సంబంధాన్ని చర్చిస్తున్నది. భారతదేశంలోని సమైక్యవాదం, (Unionism India) నమ్మకం, ప్రాంతీయ ఆకాంక్షలపై దాని ప్రభావాలను పరిశీలిస్తుంది. నాగా ప్రజలు ప్రత్యేక చరిత్ర, గుర్తింపును గుర్తించడం, సార్వభౌమాధికారం కోసం డిమాండ్లతో 1940 నుంచి నాగా తిరుగుబాటు భారతదేశానికి ఓ ముఖ్యమైన సవాల్ గా నిలిచింది. అత్యంత ముఖ్య నాగా తిరుగుబాటు గ్రూప్ లలో ఒకటైన ఎన్‌ఎస్సిఎన్ -ఐఎంతో భారత ప్రభుత్వం శాంతి చర్చలు జరిపింది. ఇది ముసాయిదా ఒప్పందంతో ముగిసింది. ఒప్పందంపై అట్టహాసంగా సంతకం చేశారు. ప్రధాని మోదీ దీనిని నాగాలాండ్ , విస్తృత ఈశాన్య ప్రాంతాలలో శాంతి, అభివృద్ధికి మార్గం సుగమం చేసే ఒక మైలురాయిగా అభివర్ణించారు.

ఈ ముసాయిదా ఒప్పందం నాగాల ప్రత్యేక చరిత్ర, ఉనికిని గుర్తించింది. భాగస్వామ్య సార్వభౌమాధికారం ఆధారంగా, భారత ప్రభుత్వం, నాగా ప్రజల మధ్య పరస్పర సంబందాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించింది. ఈ ఒప్పందం లోని కచ్చితమైన వివరాలు బహిర్గతం కాలేదు. ముఖ్యమైన డిమాండ్లలో స్వయంప్రతిపత్తి, ప్రత్యేక నాగా రాజ్యాంగం, జెండా, నాగాలాండ్, మణిపూర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ లోని నాగా నివాస ప్రాంతాలను ఒకే పరిపాలనా సంస్థగా ఏకీకృతం చేయడం, ఉన్నాయి. దీనిని తరచుగా గ్రేటర్ నాగలిమ్ అని పిలుస్తారు. ఈ ఒప్పందం అహింస, నాగా ప్రజల ఆకాంక్షలను గౌరవించడానని కూడా వాగ్దానం చేసింది. ఒప్పందంపై ఎన్నోఆశలు ఉన్నా,దాని అమలులో పురోగతి నత్తనడకన సాగింది. ప్రభుత్వం, ఎన్‌ఎస్సీఎ్-ఐఎం మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిపాయి కానీ ప్రత్యేక జెండా, రాజ్యాంగం వంటి డిమాండ్లపై భిన్నాభి ప్రాయాల వల్ల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

ఒప్పందం స్ఫూర్తిని భారత ప్రభుత్వం నీరుగార్చిందని, నాగా గ్రూప్ ఆరోపించింది. నాగా డిమాండ్లను పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలతో సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం పేర్కొంది. ఇది ఏదైనా ప్రాదేశిక నిర్మాణానికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఫెడరల్ విధానంలో మార్పు 2019 ఆగస్టు 5న భారతప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 ని రద్దుచేసింది. 1949లో అమలు చేయబడిన ఆర్టికల్ 370 కింద దేశ రక్షణ, విదేశాంగ విధానం, కమ్యునికేషన్లు మనహా, అంతర్గత వ్యవహారాలపై జమ్మూ కశ్మీర్ కు సొంత రాజ్యాంగం, జెండా, స్వయంప్రతిపత్తి కలిగి ఉండడానికి అనుమతించారు. రాష్ట్రపతి ఉత్తర్వు, 2019 జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు ద్వారా జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దయింది.

రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూకశ్మీర్, లడఖ్) విభజించారు. భారత రాజ్యాంగం పూర్తి పరిధిని ఈ ప్రాంతానికి విస్తరించారు. ఈ చర్యను భారతీయజనతాపార్టీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం జాతీయ సమైక్యత, ఆర్థికాభివృద్ధి, జమ్మూకశ్మీర్ లో టెర్రరిజాన్ని అరికట్టే దిశగా ఒక అడుగుగా సమర్థించింది. 370 రద్దుతో ఆర్టికల్ 35ఏ కూడా రద్దుచేసింది. ఇది ఆస్తి యాజమాన్యం, ప్రభుత్వ ఉద్యోగాలను జమ్మూకశ్మీర్ శాశ్వత నివాసితులకు మాత్రమే పరిమితం చేసింది. తద్వారా, ఈ ప్రాంతం భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి పెట్టుబడులు, స్థిరనివాసాలకు అవకాశం కల్పించింది. 2023 డిసెంబర్ లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన అని ధ్రువీకరిస్తూ, 2024 సెప్టెంబర్ లోగా జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రద్దు విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంది.

ఇది జమ్మూ కశ్మీర్ రాజ్యాంగం, జెండా, ద్వంద్వ పౌరసత్వ చట్టాన్ని ముగిించంది. ఈ ప్రాాంతం చట్టపరమైన, పాలనా వ్యవస్థ భారతదేశంలోని మిగిలిన ప్రదేశాలతో సమం చేసింది. ఆర్టికల్ 370 రద్దు ముసాయిదా ఒప్పందంపై నీలినీడలు కమ్మేసింది. ఎందుకంటే రెండూ ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి, ఫెడరల్ వాదం, ప్రత్యేక హోదా ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ విధానం పలు ప్రశ్నలను లేవనెత్తాయి. ఆర్టికల్ 370 రద్దుకు దారితీసిన రాజకీయ కారణాలను పరిశీలిస్తే , ఫ్రేమ్ వర్క్ ఒప్పందం అమలు పట్ల అయిష్టత ఉద్భవించినట్లు కనిపిస్తోంది. ప్రాంతీయ పాలన కంటే, కేంద్రీకృత పాలన, ఏకీకృత జాతీయ చట్రం పట్ల ప్రాధాన్యత హెచ్చింది. నాగాలతో ప్రత్యేక సంబంధం అనే ముసాయిదా ఒప్పందం చేసిన వాగ్దానం, ప్రత్యేక జెండా, రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది.

ఇది ఆర్టికల్ 370 కింద జమ్మూకశ్మీర్ లో అమలైన స్వయంప్రతిపత్తిని ధ్వనించింది. ఆర్టికల్ 370 రద్దు, జాతీయ సమైక్యతకు అడ్డంకిగా భావించిన, ప్రత్యేక హోదా ఏర్పాట్లను రద్దుచేయాలన్న భారత ప్రభుత్వం ఉద్దేశాన్ని సూచిస్తుంది. ఇది నాగా నాయకులలో ఆందోళనలను రేకెత్తించింది. లోపించిన విశ్వాసం, వాగ్దాన భంగం ఫ్రేమ్ వర్క్ ఒప్పందం అమలు చేయకపోవడం నాగా ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను తప్పిందని భావించే ప్రమాదం ఉంది. నాగా గుర్తింపు, ఆకాంక్షలను గౌరవిస్తామని హామీ ఇచ్చి, ఓ ఒప్పందంపై సంతకం చేశారు. అది అమలులో పురోగతి లేకపోవడం పలు సందేహాలకు ఆజ్యం పోసింది. ఆర్టికల్ 370 రద్దు ఈ అపన్మకాన్ని మరింత పెంచింది. జమ్మూకశ్మీర్ కు సంబంధించిన వారి అనుమతి లేకుండా భారతప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయగలిగితే, ఫ్రేమ్ వర్క్ ఒప్పందాన్ని కూడా రద్దుచేసే అవకాశం ఉందని నాగా నాయకులు వాదిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల నుంచి నాగా నివాస ప్రాంతాలను అనుసంధించే గ్రేటర్ నాగలిమ్ డిమాండ్ ఒక ముఖ్యమైన అడ్డంకిగా మారింది. జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం, ఆర్టికల్ 370 రద్దు, పాలనా సరిహద్దులను మార్చడం, భారత ప్రభుత్వం వైఖరిని హైలైట్ చేసింది.దీంతో మణిపూర్, అసోం, ఇతర పొరుగు రాష్ట్రాలు గ్రేటర్ నాగలిమ్ కోసం భూ భాగాన్ని వదులు కోవడం పట్ల జాగ్రత్త వహించాయి. దీని వల్ల అవి స్వయం ప్రతిపత్తి కోల్పోతామనిభయపడుతున్నాయి. ఫ్రేమ్ వర్క్ ఒప్పందం పట్ల ప్రభుత్వం ఆచీ తూచీ వ్యవహరించడం, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ రాషా్టాలను అభిప్రాయాలను మన్నించాలన్న కేంద్రం కోరికను ప్రతిబింబిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై ఉదాసీనవైఖరి బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో కేంద్రీకృత పాలన వైపు విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోంది.

భారత రాజ్యాంగ చట్రంలోకి జమ్మూకశ్మీర్ ను విలీనంచేయడానికి ఆర్టికల్ 370 రద్దు చేసినా, ఈ ఫ్రేమ్ వర్క్ ఒప్పందం అమలుకు నాగాలకు కొంత స్వయం ప్రతిపత్తిని మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇది కేంద్రీకృత ఎజెండాకు విరుద్ధం కావచ్చు. ఈ ఒప్పందం అమలులో భారత ప్రభుత్వం సందేహాలకు పలు రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్ చేసేలా ధైర్యం చేయవచ్చుననే భయాలు కారణం కావచ్చు.అమలు చేయకపోవడం వల్ల తలెత్తే చిక్కులు ఫ్రేమ్ వర్క్ ఒప్పందం అమలుచేయకపోవడంవల్ల చాలా నష్టాలు జరుగుతాయి. మొదటిది నాగాలాండ్ లో శాంతి ప్రక్రియ దెబ్బతింటుంది. తిరుగుబాటు కార్యకలాపాలు తిరిగి తలెత్తే అవకాశం ఉంది. ఒప్పందాన్ని గౌరవించకపోతే, 1997 నుంచి అమలులో ఉన్న కాల్పుల విరమణ విచ్ఛిన్నానికి దారి తీయవచ్చని నాగా గ్రుప్ హెచ్చరించింది.

రెండోది ప్రభుత్వం పట్ల అణగారిన వర్గాల విశ్వాసం మరింత దెబ్బతింటుంది. వాగ్దాన భంగం, కేంద్రం పట్ల అపనమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఆర్టికల్ 370 రద్దు జమ్మూకశ్మీర్ జనా భాలో చాలా వర్గాలను దూరం చేసింది. నాగాలాండ్ లోనూ ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతే కాదు, ఒప్పందం అమలు చేయకపోవడం భారతదేశ ఫెడరల్ వ్యవస్థ సూత్రాలను మరింత బలహీన పరుస్తుంది. ప్రాంతీయ ఆకాంక్షలను జాతీయ సమైక్యతతో సమతుల్యం చేయడంపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ్ వర్క్ ఒప్పందం అనేది నాగా ప్రజల ప్రత్యేక గుర్తింపును గౌరవిస్తూ కుదిరిన పరిష్కారం, ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను గుర్తించినట్లే, అలాంటి ఒప్పందాలను తిరస్కరించడం వల్ల సమాజాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఫెడరల్ నిర్మాణం బలహీనపడే ప్రమాదం ఉంది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కీలక డిమాండ్ జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, నాగా ఆందోళనలను పరిష్కరించడానికి ఒక బ్లూప్రింట్ ను అందిస్తున్నది. 3024 జూలైలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాష్ట్రహోదా పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. 2025 ఆగస్టు 8న సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించింది జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా మంజూరుకు కేంద్రం సుముఖంగానే ఉన్నట్లు సూచిస్తోంది. ఇది ఫ్రేమ్ వర్క్ ఒప్పందం పై పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. అయితే ఆర్టికల్ 370 ని పునరుద్ధరించడం అసంభవం. దీనికి పార్లమెంటులో మూడింట రెండువంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ అవసరం, అది రాజకీయ సవాల్ తో కూడిన పని. ఫ్రేమ్ వర్క్ ఒప్పందం కోసం ప్రభుత్వం ఎన్‌ఎస్సీఎన్- ఐఎం, అతర రాష్ట్రాలతో పారదర్శకంగా సంభాషణలు జరపాలి. ఇక ప్రాంతీయ ఆందోళనలను పరిష్కరించుకుంటూ, నాగా ఆకాంక్షలను గౌరవించేడం అవసరం.

ఇందులో నాగాలసాంస్కృతిక, పరిపాలనా పరమైన స్వయంప్రతిపత్తిని మంజూరుచేయడం, ఆర్థిక సమస్యల పరిష్కారానికి చొరవచూపడం వంటివి ఉన్నాయి. ప్రేమ్ వర్క్ ఒప్పందం, ఆర్టికల్ 370 రద్దు అనేవి భారత ఫెడరల్ చట్టంలో ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించడంలో గల క్లిష్ట పరిస్థితిని చూపే ఒకదానితో ఒకటి ముడివడి ఉన్న సమస్యలు. ఫ్రేమ్ వర్క్ ఒప్పందాన్ని అమలు చేయడంలో భారత ప్రభుత్వం అయిష్టత, ఆర్టికల్ 370 రద్దు కు దారితీసిన విషయంలో ప్రభావితమై ఉండవచ్చు. చర్చలద్వారా పరిష్కారాలను కనుగొనడం వల్ల కేంద్రం నిబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందం అమలు చేయకపోవడం వల్ల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉంది. ఫెడరల్ వాదం బలహీనపడవచ్చు. భారతదేశం ఈ సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు, ప్రాంతీయ గుర్తింపులను గౌరవిస్తూ, జాతీయ సమైక్యతను సమతుల్యం చేసుకోవాలి. శాశ్వత శాంతి, ఐక్యత పెంపొందించేందుకు ఫ్రేమ్ వర్క్ ఒప్పందం వంటి వాటి విషయంలో ఇచ్చిన వాగ్దానాలను గౌరవించాలి.

  • గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
  • రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News