Friday, August 15, 2025

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజారోగ్యానికి కృషి : చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతున్నామని సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. రూ. 953 కోట్ల ఖర్చుతో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు పంపిణీ చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తమ విధానమని, విశాఖ పట్టణం, విజయవాడ మెట్రో రైల్ పట్టాలు ఎక్కించామని తెలియజేశారు. 2028 నాటికి రాజధాని తొలిదశ పూర్తి చేస్తామని, త్వరలో లాజిస్టిక్ కార్పొరేషన్ తెస్తామని చెప్పారు.

వచ్చే మూడేళ్లలో రూ. 2లక్షల కోట్ల జాతీయ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యంగా ఎపి ఇటి గ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తెచ్చామని చంద్రబాబు అన్నారు. 72 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించామని, అడవులు, హార్టికల్చర్ పెంచి 50 శాతం పచ్చదనం కోసం కృషి చేశామన్నారు. 175 నియోజక వర్గాల్లో ఎమ్ఎమ్ఇ పార్కులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గత పాలకులు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారని, మద్యం వ్యాపారం చేసి ప్రాణాలు దోచుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News