హైదరాబాద్: ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన భయంకరమైన సీజన్లోకి భారతదేశం అడుగుపెడుతున్నందున, సహజ వైద్యంలో ఒక పురోగతి ప్రధాన శీర్షికలను సృస్తిస్తోంది. దీర్ఘకాలిక ఫంగల్ చర్మ ఇన్ఫెక్షన్ల కోసం పేటెంట్ పొందిన, స్టెరాయిడ్ రహిత నివారణ, స్కిన్ రివైవ్ ను ఎత్నిక్ అభివృద్ధి చేసింది. శాస్త్రీయ ధ్రువీకరణతో ఆహార ఆధారిత సంప్రదాయాన్ని మిళితం చేసే తదుపరి తరం వెల్నెస్ బ్రాండ్, ఎత్నిక్. ఈ ఆవిష్కరణ కీలకమైన సమయంలో వస్తుంది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనిరాలజిస్ట్స్ అండ్ లెప్రాలజిస్ట్స్ (IADVL) ప్రకారం, డెర్మటోఫైటోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కొన్ని భారతీయ రాష్ట్రాలలో 61% వరకు జనాభాను ప్రభావితం చేస్తాయి, తేమతో కూడిన వర్షాకాల నెలల్లో కేసులు పెరుగుతాయి. అయినప్పటికీ సాంప్రదాయ చికిత్సలు తరచుగా స్టెరాయిడ్-ఆధారిత క్రీములపై ఆధారపడతాయి, ఇవి తిరిగి వచ్చే ప్రమాదం కలిగించటం తో పాటుగా ఔషధ నిరోధకతను కలిగిస్తాయి. ఇది చర్మవ్యాధి నిపుణులలో ఆందోళన గా మారుతుంది.
స్కిన్ రివైవ్ ఇక్కడ వేరే మార్గాన్ని తీసుకుంది. భారతదేశం మరియు అంతర్జాతీయంగా పేటెంట్ పొందిన ఈ ఫార్ములా, దాని ప్రత్యేకమైన కూర్పు మరియు చర్యా విధానం పరంగా విభిన్నమైనది. బాదం సారం, కొబ్బరి నూనె, యూకలిప్టస్ నూనె మరియు చమోమిలేలను కలిపి – ప్రత్యేక ఉష్ణోగ్రత మరియు పీడన వెలికితీత పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేయబడింది. CTRI వద్ద నమోదు చేయబడిన క్లినికల్ ట్రయల్స్ 90% కంటే ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.ఫంగల్ చర్మ వ్యాధులకు నిజంగా పేటెంట్ పొందిన సహజ నివారణను మార్కెట్లోకి తీసుకురావడం ఇదే మొదటిసారి” అని ఎత్నిక్ సహ వ్యవస్థాపకుడు తాజిందర్ విర్క్ అన్నారు.
“సాంప్రదాయ వైద్యం పూర్తిగా ప్రభావవంతంగా పని చేయలేని లేని చోట పరిష్కారాలను అందించడానికి మేము ఎత్నిక్ను తీర్చిదిద్దాము. ఆహార ఆధారిత నివారణల జ్ఞానాన్ని కఠినమైన క్లినికల్ సైన్స్‌తో మిళితం చేయటం జరిగింది. స్కిన్ రివైవ్ మా మొదటి రుజువు పాయింట్ – మరియు ఇది ప్రారంభం మాత్రమే” అని అన్నారు.
భారతదేశపు పురాతన ఆహార ఆధారిత వైద్య సంప్రదాయాలను ఆధునిక క్లినికల్ సైన్స్‌తో అనుసంధానించడానికి, ప్రభావవంతమైన , పారదర్శకమైన సహజ నివారణలను సృష్టించడానికి ఎత్నిక్ రూపొందించబడింది. ప్రకృతిలో మిళితమైన , కఠినమైన పరిశోధనల మద్దతుతో మరియు నేటి ఆరోగ్య సవాళ్ల కోసం రూపొందించబడిన వెల్నెస్ పరిష్కారాలను అందించడానికి బ్రాండ్ కట్టుబడి ఉంది. ఈ పేటెంట్ అందుకున్న ఆవిష్కర్తలలో ఒకరైన డాక్టర్ సునీతా కుమారి అభివృద్ధి చేసిన స్కిన్ రివైవ్, ఆయుష్-సర్టిఫైడ్, జిఎంపి -తయారు చేసిన మరియు విస్తృత-స్థాయి ఫంగల్ నిరోధకత కోసం పరీక్షించబడింది. తరచుగా లక్షణాలను కప్పిపుచ్చే ప్రామాణిక యాంటీ ఫంగల్స్ మాదిరిగా కాకుండా, స్టెరాయిడ్లతో సంబంధం ఉన్న ప్రమాదాలు లేకుండా ఫంగల్ పెరుగుదల యొక్క మూల కారణాన్ని తొలగించడం దీని లక్ష్యం.
“మా క్లినికల్ ఫలితాలు సాంప్రదాయ చికిత్సలు విఫలమైన కేసులలో స్పష్టమైన, స్థిరమైన మెరుగుదలను చూపుతున్నాయి” అని డాక్టర్ సునీత అన్నారు.భారతదేశంలోని ఆహార ఆధారిత వైద్యం యొక్క గొప్ప సంప్రదాయాలకు శాస్త్రీయ కఠినతను వర్తింపజేయడానికి తాజిందర్ విర్క్, డాక్టర్ రాజోరియా మరియు డాక్టర్ అంకిత్ వాత్స్యాయన్ కలిసి ఎథ్నిక్ను స్థాపించారు. స్కిన్ రివైవ్ అనేది బ్రాండ్ యొక్క తొలి ఉత్పత్తి, త్వరలోనే మరిన్ని అదనపు ఆవిష్కరణలు రానున్నాయి.10ml మరియు 30ml ఫార్మాట్లలో అందుబాటులో ఉన్న స్కిన్ రివైవ్, ఔషధ నిరోధకత భారతదేశం అంతటా వ్యాపించడంతో చికిత్స చేయడం కష్టతరంగా మారుతున్న పరిస్థితిలో దీర్ఘకాలిక ఫంగల్ చర్మ ఇన్ఫెక్షన్లకు సమర్థవంతమైన, సహజ పరిష్కారాన్ని కోరుకునే వారికి పేటెంట్ పొందిన, క్లినికల్‌గా నిరూపితమైన ఎంపికను అందిస్తుంది . బలమైన క్లినికల్ పునాది మరియు అభివృద్ధి పరంగా ఆవిష్కరణల శ్రేణితో , నిరూపితమైన నివారణలను అందించటం ద్వారా భారతదేశంలో వెల్నెస్ను పునర్నిర్వచించాలని ఎత్నిక్ లక్ష్యంగా పెట్టుకుంది.