- Advertisement -
వినూత్న కథలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న గుణ శేఖర్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను తగ్గట్టుగా ‘యుఫోరియా’ (Euphoria) అంటూ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో రాబోతోన్నారు. లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఇక బుధవారం ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘యుఫోరియా’ చిత్రం లో జయదేవ్ నాయర్ పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా గౌతమ్ మీనన్ ఆసక్తికరమైన లుక్‌తో కనిపిస్తున్నారు. విఘ్నేష్ గవిరెడ్డి ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుండగా.. ప్రముఖ నటి భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ పతాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- Advertisement -