స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్ డ్రామా తెలుసు కదా.(Telusu kada)) ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ – మల్లికా గంధను లాంచ్ చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. మల్లికా గంధ లవ్ అండ్ మ్యూజికల్ మ్యాజిక్ తో మనసును తాకే అద్భుతమైన పాట. ట్యూన్, విజువల్స్‌తో ఈ పాట ప్రేమ భావోద్వేగాలను బ్యూటీఫుల్‌గా చూపిస్తోంది.
సిద్ శ్రీరామ్ గాత్రం మాటల్లో చెప్పలేనంత ఫీల్‌ని ఇస్తుంది. దర్శకురాలు నీరజా కోన, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్ కలసి ప్రేమ ప్రపంచాన్ని తెరపై (world love screen) అద్భుతంగా మలిచారు. ప్రతీ ఫ్రేమ్ విజువల్ ఫీస్ట్‌లా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఇద్దరి నేచురల్ బాడీ లాంగ్వేజ్ పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చాయి. ఈ మూవీలో మరో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. తెలుసు కదా సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.