న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చోకర్‌ను అరెస్టు చేసింది. దీన్ దయాళ్ ఆవాస్ యోజన కింద చోకర్, అతని కంపెనీ దాదాపు రూ.1,500 కోట్లు అక్రమంగా తరలించారని ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను దేశ రాజధాని ఢిల్లీలోని ఒక హోటల్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను గురుగ్రామ్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
తన కుమారులు వికాస్ చోకర్, సికందర్ చోకర్‌తో కలిసి ధరమ్ సింగ్ 1,500 మందికి పైగా గృహ కొనుగోలుదారులను మోసం చేసి, వారి నిధులు రూ.500 కోట్లకు పైగా మళ్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సికందర్‌ను గత సంవత్సరం ED అరెస్టు చేయగా.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మరో కుమారుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, పానిపట్ జిల్లాలోని సమల్ఖా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన ధరమ్ సింగ్ చోకర్.. గత సంవత్సరం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు.