Thursday, July 31, 2025

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌పై వేటు?

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : జిల్లా కేంద్రంలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ యాదవ్‌ను ఉద్యోగం నుండి తొలగించామని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ రవీందర్ రాజు తెలిపారు. విధులు నిర్వహిస్తూ అక్రమంగా ఆల్ఫాజోలం వంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ కొందరు వ్యక్తులతో చీకటి వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. రమేష్ యాదవ్‌ను నార్కోటిక్ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయనపై ఆరోపణలు రుజువు కావడంతో తొలగించామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News