- Advertisement -
కూకట్ పల్లి పరిధిలో చోటుచేసుకున్న కల్తీ కల్లు ఘటనలో మరోకరు ప్రాణాలు కోల్పోయారు. గురువారం సాయంత్రం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సమ్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో 31 మంది బాధితులు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇందులో నలుగురికి డయాలసిస్ చేస్తున్నారు. మరోవైపు, ఈ కల్తీ కల్లు ఘటనపై బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. పలు కల్లు దుకాణాల నమూనాలను అధికారులు పరీక్షకు పంపించారని.. కల్లులో ఆల్ఫ్రాజోలం కలిపినట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆయా కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేసినట్లు ఎక్సైజ్ శాఖ చెప్పింది. కాగా.. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -