Sunday, May 4, 2025

ఎసిబి వలలో ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్‌

- Advertisement -
- Advertisement -

జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీధర్ రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒక ఉద్యోగికి 2022-23వ సంవత్సరానికి సంబంధించి టిఎ బిల్లులు రూ.76 వేలు రావలసి ఉండగా రూ. 8000 లంచంగా ఇస్తేనే బిల్లు చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని, బిల్లులు చేయండని ఆ ఉద్యోగి విన్నవించుకున్నాడు. అయినా ససేమిరా సీనియర్ అసిస్టెంట్ వినకుండా డబ్బులు ఇస్తేనే బిల్లులు చేస్తానన్నాడు. దీంతో చేసేది లేక సదరు బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించగా శుక్రవారం ప్రణాళిక ప్రకారం లంచం డబ్బులు తీసుకుంటుండగా, దాడులు నిర్వహించి సీనియర్ అసిస్టెంట్‌ను రెడ్ హ్యాడెండ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News