ఈ వైఖరిలో మార్పులేదన్న విదేశాంగశాఖ
మధ్యవర్తిత్వంపై ట్రంప్ ప్రతిపాదన నేపథ్యంలో స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కశ్మీర్ అంశం భారతదేశం, పాకిస్తాన్ (Pakistan) మధ్య ద్వైపాక్షిక సమస్య అని, ఈ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (External Affairs Ministry Randhir Jaiswal ) స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్య వర్తిత్వం వహించేందుకు అమెరికా ప్రతిపాదన చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ అనే భారత కేంద్రప్రాంతానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే భారతదేశం, పాకిస్తాన్ (Pakistan) ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని భారతదేసం జాతీయస్థాయిలో అభిప్రాయపడుతోందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (External Affairs Ministry Randhir Jaiswal ) తెలిపారు. ఈ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
పాక్ ఆక్రమిత భారత భూభాగాన్ని విడిచి పెట్టడమే ఇక మిగిలిన విషయం అని జైస్వాల్ స్పష్టం చేశారు. అణుయుద్ధంపై ట్రంప్ ఊహాగానాలపై జైస్వాల్ మాట్లాడుతూ భారత సైనిక దళాలు చేపట్టిన చర్య పూర్తిగా సంప్రదాయ డోమైన్ లోనే ఉందని అన్నారు. భారతదేశం అణ్వస్త్ర బెదిరింపులకు లొంగదని, దానిని బూచి గా చూపి టెర్రరిస్ట్ చర్యలకు పాల్పడితే సహించబోదని జైస్వాల్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి పూర్తిగా మద్దతు మానుకుంటే తప్ప సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదలలో ఉంచుతామని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.