అమరావతి: ఫేస్ బుక్ లో పరిచయమైన యువతిని గాఢంగా ప్రేమించాడు, యువతిని పెళ్లి చేసుకోమ్మని అడగడంతో ఆమె తిరస్కరించడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తటివర్రు గ్రామంలో సంపత్ కుమార్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఫేస్ బుక్ లో ఓ యువతితో సంపత్ కు పరిచయమైంది. ఆ యువకుడు ఆమెను గాఢంగా ప్రేమించాడు. గత కొన్ని రోజుల నుంచి యువకుడితో యువతి సరిగా మాట్లాడకపోవడంతో నిరాశగా ఉన్నాడు. ఆమెకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామని అడిగాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన స్నేహితుడు యువరాజుకు ఈ విషయం తెలిపాడు. యువకుడిని వెంటనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఫేస్ బుక్ లో స్నేహం ప్రాణం మీదికి వచ్చింది
- Advertisement -
- Advertisement -
- Advertisement -