Tuesday, September 9, 2025

లేని దేశానికి ఎంబసీ!

- Advertisement -
- Advertisement -

ఘజియాబాద్‌లో ఫేక్
రాయబార కార్యాలయం !
గుట్టురట్టు చేసిన యూపీ
ఎస్.టి.ఎఫ్ అధికారులు
వెస్ట్ ఆర్కిటికా మైక్రోనేషన్
పేరుతో దందా ఆ దేశ
రాజుగా చెప్పుకుంటున్న
హర్షవర్థన్ జైన్ అరెస్ట్
నకిలీ విదేశీ కరెన్సీతో ఫేక్
ఉద్యోగాల రాకెట్ సూత్రధారి

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఊరూ పేరూ లేని దేశానికి చెందిన నకిలీ రాయబార కార్యాలయం ఉంది అంటే.. నమ్ముతారా. . నిజం. భారీ హంగులు,..విలాసవంతమైన రెండు అంతస్థుల భవనం, భవనం ముందు.దౌత్య నంబర్ ప్లేట్లతో ఉన్న ఖరీదైన కార్లు, దౌత్య పాస్ పోర్ట్ లు, విదేశీ కరెన్సీ, బడా నాయకులతో మార్పింగ్ చేసిన ఫోటోలు.. అన్నీ నకిలీవే. ఈ నకిలీ రాయబార కార్యాలయం గుట్టును ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్ టిఎఫ్) అధికారులు రట్టుచేశారు. హర్ష వర్థన్ జైన్ అనే వ్యక్తి ఏడేళ్లుగా ఈ రాయబార కార్యాలయాన్ని నడుపుతున్నాడు. అమెరికా నేవీ అధికారి స్థాపించిన చిన్నదేశం వెస్టార్క్టికా అన్న పేరుతో ప్రపంచంలో ఏ దేశం గుర్తించని దేశానికి చెందిన ఎంబెస్సీ అది. ఎలాంటి సార్వభౌమత్వం లేని ఆ దేశంలో పని ఇప్పిస్తానని ప్రజలను ఆకర్షిస్తూ, ఉద్యోగ రాకెట్ ను నడుపుతున్న హర్షవర్థన్ జైన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మనీలాండరింగ్ నెట్ వర్క్ కు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

హర్షవర్థన్ జైన్ తనను తాను వెస్టార్కిటికా బారన్ గా పరిచయం చేసుకుంటూ, దౌత్య నెంబర్ గల ఖరీదైన కార్లలో తిరుగుతూ గొప్పగా చలామణి అయిపోయాడు. ఉన్నత వర్గాలను ఆకట్టుకునేందుకు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులతో తాను కలిసి తీసుకున్నట్లు ఫోజ్ కొడుతూ, మార్ఫింగ్ చేసిన ఫోటోలను కార్యాలయంలో ప్రదర్శించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి అతడి పై గతంలో యూపీ పోలీసులవద్ద ఓ కేసు కూడా నమోదయింది. 2011లో చట్టవిరుద్ధంగా శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్న
కేసులో నిందితుడు. జూలై 22న నోయిడాలో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ యూనిట్ ఘజియాబాద్ లోని నకిలీ రాయబార కార్యాలయం నడుపుతున్న హర్షవర్థన్ జైన్ ను అరెస్ట్ చేసింది. పోలీసులు ప్రశ్నించినా.. అతడు తాను వెస్టార్కిటికా , ఇతర మైక్రోనేషన్ల నెట్ వర్క్ రాయబారిగానే గంభీరంగా ఫోజు కొట్టాడు. ఎస్ టిఎఫ్ అధికారులు గట్టిగా నిలదీసినప్పుడు గుట్టు రట్టయింది.

దౌత్య నెంబర్ ప్లేట్లు కలిగిన నాలుగు హై-ఎండ్ కార్లు, 12 మైక్రోనేషన్ల దౌత్య పాస్ పోర్ట్ లు, విదేశాంగ మంత్రిత్వశాఖ స్టాంపులు గల డాక్యుమెంట్లు, 34 దేశాల స్టాంపులు రూ. 44 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, 18 దౌత్య నెంబర్ ప్లేట్లను ఎస్ టిఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దౌత్య నెంబర్ ప్లేట్లు ఏదేశానివీ కావు. అన్నీ నకిలీనే. ప్రముఖుల మార్ఫింగ్ ఫోటోలతో మాయ చేశాడు. విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తానని, ఉద్యోగ రాకెట్, షెల్ కంపెనీల ద్వారా హవాలా రాకెట్ పకడ్బిందీగా నడిపాడని ఎస్ టి ఎఫ్ సీనియర్ సూపరింటెండెంట్ సుశీల్ గులే వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసి, ఈ రాకెట్
నడుపుతున్నందుకు, నకిలీ పత్రాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వెస్టార్కిటికా ఎక్కడ.. ఉందా
అంటార్కిటికాలో ఉన్న వెస్టార్కిటికా 6,20,000చదరపు మైళ్ల విస్తీర్ణం గల ప్రాంతం. అమెరికా నేవీ అధికారి ట్రావిస్ మెక్ హెన్సీ 2001లో వెస్టార్కిటికాను స్థాపించి, దానికి తానే గ్రాండ్ డ్యూక్ గా నియమించుకున్నాడు.అంటార్కిటికా ఒప్పందం కింద ఏదేశం ఆ ప్రాంతాన్ని క్లైమ్ చేయడానికి వీలు లేదు కానీ ఆ ఒప్పందంలో లొసుగులను ఉపయోగించి మెక్ హెన్సీ తనను తాను పాలకుడుగా నియమించుకున్నాడు. వెస్టార్కిటికా లో 2,356 మంది పౌరులు ఉంటారని ప్రకటిస్తారు తప్ప అక్కడ ఎవరూ నివసించరు. దక్షిణ కాలిఫోర్నియా కిందకు వచ్చే గ్రాండ్ డచీ ఆఫ్ వెస్టార్కిటికా – వాతావరణమార్పులు, అంటార్కిటికా పై అవగాహన కల్పించే లాభాపేక్ష లేని సంస్థ మాత్రమే. దానికి సొంత జెండా, కరెన్సీ ఉన్నా, ఏ ప్రభుత్వం గుర్తించని ప్రాంతం.

యూపీ ఎస్ టి ఎఫ్ నకిలీ ఎంబెస్సీని కనిపెట్టడానికి ముందు వెస్టార్కిటికా పేరుతో అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో న్యూఢిల్లీ లోని కాన్సలేట్ జనరల్ కార్యాలయం ఫోటోలు దర్శనమిచ్చాయి. బారన్ హెచ్.వి. జైన్ నిర్వహణలో న్యూఢిల్లీలోని వెస్టార్కిటికా కాన్సులేట్ 2017 నుంచి పని చేస్తోంది. భారతదేశంలో వెస్టార్కిటికా ప్రయోజనాలకు కృషిచేస్తూ. బారాన్ జైన్ స్థానికులకు ఏటా ఐదుసార్లు ఆహారం అందించడంతో పాటు 1000 మందికి సేవలు అందిస్తున్నట్లు ఘజియాబాద్ లోని భవనంలో బోర్డు లను డిస్ ప్లే, బండారా జైన్ ఫోటో లను షేర్ చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News