హైదరాబాద్: ఓ విద్యార్థినిని టీచర్ లైంగికంగా వేధించడంతో ఆమె కాలేజీ ఆవరణంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివాల ప్రాకరం… ఫకీర్ మోహన ఆటోనమస్ కాలేజీలో విద్యార్థిని సౌమ్యశ్రీ బిఎడ్ రెండో సంవత్సరం చదువుతోంది. హెచ్‌ఒడి సమీర్ కుమార్ సాహూ గత కొన్ని రోజుల నుంచి సౌమ్యను లైంగికంగా వేధిస్తున్నారు. అతడి వేధింపులు శృతిమించడంతో కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్‌కు ఫిర్యాదు చేసింది. కానీ ప్రిన్సిపల్ సాహూపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒత్తిడికి లోనైంది. సెక్సువల్‌గా ఫేవర్‌గా లేకపోతే విద్య పరంగా భవిష్యత్‌ను నాశనం చేస్తానని ఆమెను సాహూ బెదిరించాడు. దీంతో కాలేజీ ఆవరణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. సహ విద్యార్థులు మంటలను ఆర్పేసి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా స్వల్పంగా గాయపడింది. ప్రస్తుతం నిందితుడు సాహూను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రిన్సిపాల్ ఘోష్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యా శాఖ మంత్రి తెలిపారు.
లైంగికంగా వేధించిన పంతులు… కాలేజీలో పెట్రోల్ పోసుకొని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
- Advertisement -