Thursday, September 4, 2025

లిస్బన్‌లో పట్టాలు తప్పిన స్ట్రీట్ కారు: 15 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

లిస్బన్: పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతం నుంచి కిందకు వస్తున్న క్రమంలో ఓ ఎలక్ట్రీక్ కారు పట్టాలు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రులలో చిన్నారులు, విదేశీయులు ఉన్నట్టు సమాచారం. ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికిచేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగినప్పుడు కారులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. లిస్బన్ అందాలకు పెట్టింది పేరు కావునా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ప్రతి సంవత్సరం దాదాపుగా కోటి మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. రోడ్డు మధ్యలో పట్టాలు ఉంటాయి. స్ట్రీట్ కార్లు రైలు బోగీల మాదిరిగా ఉంటాయి. లిస్బన్ సిటీ మొత్తం తిరుగుతాయి.

Famed streetcar in Lisbon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News