- Advertisement -
యంగ్ హీరో హవీష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ పార్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హీరోతో పాటు ప్రధాన నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉండబోతుంది.
Also Read : నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి
- Advertisement -