పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ దేశంతో టీం ఇండియా క్రికెట్ ఆడొద్దని మాజీలు, అభిమానులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌లో కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్‌ని రద్దు చేసుకున్నారు. అయితే తాజాగా ఆసియాకప్ (Asia Cup) షెడ్యూల్‌ని ప్రకటించారు. ఇందులో భారత్, పాకిస్థాన్‌లు రెండుసార్లు తలపడనున్నాయి. అయితే ఈసారి హోస్టింగ్ హక్కులు భారత్‌వే అయినా.. మ్యాచ్‌లు మాత్రం యుఎఇలో నిర్వహిస్తున్నారు. దీంతో బిసిసిఐపై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బాయ్‌కాట్ ఆసియాకప్ అంటూ సోషల్‌మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.
కార్గిల్ విజయ్ దివస్ రోజున ఆసియాకప్ (Asia Cup) షెడ్యూల్‌ని ప్రకటించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సెప్టెంబర్ 14న ఆదివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మంచి ఫండింగ్ వస్తుందని.. మళ్లీ దానిని భారత్ మీదనే ఉపయోగిస్తారని ఓ అభిమాని కామెంట్ చేశారు. భారత ఆర్మీపై ఏ మాత్రం గౌరవం ఉన్నా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడొద్దు అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. ‘‘ఓవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తామని కేంద్రం చెప్తుంటే.. బిసిసిఐ మాత్రం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధం కావడం పూర్తిగా అవమానకరం అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. భారత్ పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడితే.. ఆ దేశానికి భారీగా ఆదాయం వస్తుందని.. ఆ డబ్బులను తిరిగి మనమీదే దాడి చేసేందుకు ఉపయోగిస్తుందని మరో వ్యక్తి అన్నాడు.