Tuesday, September 2, 2025

పొలంలోనే నేలకొరిగిన రైతన్న

- Advertisement -
- Advertisement -

వరి నాట్లు వేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మండలం, కొత్తకుంట తండాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన కేతావత్ సూర్యనాయక్(45) తన వ్యవసాయ పొలంలో వరి నారు కట్టలు పంచేందుకు వెళ్లాడు. నార్ల కట్టలు వేస్తుండగానే గుండెపోటుకు గురై కుప్పకూలి కన్నుమూశాడు. మృతుడికి భార్య శారద, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయం పనులు లేని సమయంలో సూర్యనాయక్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సూర్యానాయక్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News