- Advertisement -
పెద్దపల్లి జిల్లా, మంథని మండలం, ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన దండిగ కొమురయ్య శనివారం తెల్లవారు జామున కరెంట్ షాక్‌తో మృతి చెందారు. పొలం వద్దకు వెళ్లిన తన తండ్రి ఇంకా ఇంటికి రాకపోవడంతో కొడుకు వెళ్ళేసరికి కరెంట్ షాక్ కొట్టి చనిపోయి ఉన్నాడని తెలిపాడు. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు.
- Advertisement -