- Advertisement -
మన తెలంగాణ / మహబూబ్ నగర్ బ్యూరో: మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామానికి చెందిన బొజ్జయ్య(53) అనే రైతుకి వ్యవసాయ పనులు చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో 108 అంబులెన్స్‌కి కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఆక్సిజన్ అందక ఆయాస పడుతూ కుటుంబ సభ్యుల కళ్ల ముందే బొజ్జయ్య చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఆక్సిజన్ సౌకర్యం లేనందున 108 సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లనే బొజ్జయ్య చనిపోయారని తెలిపారు. అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారని, కానీ అంబులైన్స్ వైద్యుల నిర్లక్షం వల్లనే బొజ్జయ్య చనిపోయారని కుటుంబసభ్యులు వాపోయారు.
- Advertisement -