- Advertisement -
గణపురం: భార్యకి చెప్పకుండా ఓ భర్త డబ్బు దాచిపెట్టడం అతనికి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. డబ్బు విషయంలో అతను జాగ్రత్తపడ్డానని అనుకున్నాడు.. కానీ అదే అతని కొంపముంచింది. అసలేం జరిగిందంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీ నగర్‌కు చెందిన పోతురాజు వీరయ్య అనే రైతు (Farmer) ఎడ్లను విక్రయించగా.. వచ్చిన రూ.1.50 లక్షలను ధాన్యం బస్తాలో (Grain Sack) దాచిపెట్టాడు. అయితే గత బుధవారం విడి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి గ్రామానికి రాగా.. వీరయ్య భార్య అతనికి ధాన్యం బస్తాను విక్రయించింది. కొంత సేపటికి పొలం నుంచి వచ్చిన వీరయ్య బస్తా ఏదని ప్రశ్నించగా.. దాన్ని విక్రయించానని భార్య చెప్పింది. దీంతో ఆ వ్యాపారి కోసం గ్రామంలో గాలించినా ఆచూకీ లభించలేదు. చివరకు వీరయ్య చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -