- Advertisement -
హైదరాబాద్: పదేళ్ల కెసిఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు తెలిపారు. దేశవ్యాప్తంగా 2015 2022 మధ్య నమోదైన రైతు ఆత్మహత్యల గణాంకాలను హరీష్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2015లో 11.1 శాతం ఉండగా, 2022 నాటికి 1.57 శాతానికి తగ్గినట్లు తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, కాళేశ్వరం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు.
- Advertisement -