Wednesday, April 30, 2025

అలా చేయకపోతే.. నష్టపోయేది రైతులే: తుమ్మల

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: తెలంగాణకు పసుపుపారాణి లాంటిది నిజామాబాద్ జిల్లా అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిజామాబాద్‌లో రైతు మహోత్సవాన్ని ఆయన మరో మంత్రి జూపల్లితో కలిసి ప్రారంభించారు. పసుపు పంటకు మద్ధతు వస్తేనే.. పసుపురైతు తలెత్తుకుని ఉండగలడు అని పేర్కొన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణకు సాటివచ్చే రాష్ట్రం మరొకటి లేదని.. రైతులకు రూ.2 లక్షలు వరకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్ఫష్టం చేశారు.

కొన్ని కారణాల వల్ల రైతు భరోసా అర్థంతరంగా నిలిచిపోయిందని అన్నారు. మిగిలిన రైతులకు కూడా త్వరలో రైతుభరోసా నిధులు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిన మిగతా అన్ని పథకాలను నిలిపివేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు వ్యవసాయ మంత్ర పరికరాలను ఇవ్వలేదని.. ఈ ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. నష్టాలు వస్తున్నప్పటికీ.. అన్ని పంటలను మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనగోలు చేస్తోందని తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు చాలా పెరగాల్సి ఉంది… ప్రతి జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది పేర్కొన్నారు.

ఆయిల్‌పామ్ సాగు చేయకపోతే రైతులే నష్టపోయే పరిస్థితి వస్తుంది తెలిపారు. 4 ఎకరాల వరి సాగుతో వచ్చే లాభం ఎకరం అయిల్‌పామ్ తోటలో వస్తుందని.. దేవరకొండలో ఒక రైతు కుంకుడుకాయల సాగుతో రూ.6 లక్షలు సంపాదిస్తున్నారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News