Tuesday, September 16, 2025

అలైన్‌మెంట్‌పై నిరసన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని నగరానికి మరో మణిహారంగా మారను న్న రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగంలో అలైన్ మెంట్ మార్పులు రైతుల్లో ఆ గ్రహానికి కారణం అవుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగంలో 201 కిలోమీటర్ల మేరకు నిర్మాణానికి వీలుగా మూడు అలైన్‌మెంట్లను ప్రతిపాదించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం లేకుండా అలైన్‌మెంట్ మార్పులు చేశారని, పేద, మధ్యతరగతి రైతులు మొత్తం సాగుభూములను కోల్పోయే పరిస్థితి నెలకొందని గత కొన్ని రోజులు ఆందోళన బాట పట్టారు. కొందరు రైతులు నగరంలోని రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ) కార్యాలయా ల వద్ద తమ అభ్యంతరాలతో వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించా రు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రతిపాదిత అలైన్‌మెంట్ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ అలైన్‌మెంట్ కిం ద ఎనిమిది జిల్లాలు, 33 మండలాలు మరియు 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను విస్తరించి ఉంది, డిజిటల్ మ్యాప్‌లు, వివరణాత్మక సర్వే నంబర్‌లను హెచ్‌ఎండిఏ వెబ్‌సైట్‌లో ఉం చారు. ఈనెల 15వ తేదీ నాటికి తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలను హెచ్‌ఎండిఏ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా అందజేయాలని నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. దీని త ర్వాత, హెచ్‌ఎండిఎ తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఎక్స్‌ప్రెస్‌వే రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో అమంగల్, ఫరూఖ్ నగర్, కేశంపేట, కొండూర్గ్, మాడ్గుల్, తలకొండపల్లెతో సహా మండలాల్లోని గ్రామాల ను కవర్ చేస్తుంది. వికారాబాద్ జిల్లాలో మోమిన్‌పేట్, నవాబుపేట, పూడూరు, వికారాబాద్ మండలాల మీదుగా అలైన్‌మెంట్ ఉంది.

భూ నిర్వాసితుల రాస్తారోకో
సంస్థాన్ నారాయణపురం : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం దేవిరెడ్డి బంగ్లా గేటు వద్ద మునుగోడు నల్గొండ రహదారిపై భూ నిర్వాసితులు బైటాయించి సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ రాకతో తమకున్న రెండు, మూడు ఎకరాల భూములు కోల్పోయి నిరాశ్రయులయ్యే ప్రమాద ముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం మీద ఆదారపడి బ్రతుకుతన్న మాకు ప్రభుత్వం ఇచ్చే ఈ కొద్దిపాటి నష్ట పరిహారంతో ఏం చేయగలమని వారు ప్రశ్నించారు. నష్టపరిహారం మా కొద్దు మా భూమి మాకే కావాలంటూ భీష్మించుకొని కూర్చునున్నారు. అలైన్మెంట్ మార్చి మా భూములు మాకు ఉండే విధంగా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నల్గొండ వెళ్లే రహదారిపై భూ నిర్వాసితులు చేస్తున్న ధర్నా ప్రదేశానికి స్థానిక ఎస్సై జగన్ నేతృత్వంలో పోలీస్ బృందం అక్కడికి చేరుకొని ధర్నాను విరమింపజేశారు. ధర్నాలో భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

స్పీకర్, ఆర్డీఓ కార్యాలయాల ముందు ఆందోళన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి : త్రిబుల్ ఆర్ వద్దు, మా భూములు మాకే ముద్దు అంటూ వికారాబాద్ జిల్లా రైతులు సోమవారం శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లాలో ట్రిపుల్‌ఆర్ వల్ల నష్టపోతున్న రైతులు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి క్యాంప్ కార్యాల యం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం త్రిబుల్ ఆర్ వద్దు సాగు భూములు ఇవ్వమంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డివో ఆఫీస్ ముందు నినాదాలు చేస్తూ త్రిబుల్ ఆర్ వద్దు సాగు భూములు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది బడా రాజకీయ నాయకుల భూములు కాపాడందుకే పాత అలైన్మెంట్ మార్చడం జరిగిందని, బడా వెంచర్ లను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఒక మాజీ ఎంపీ భూములు కాపాడేందుకే అలైన్‌మెంట్‌లో మార్పలు చేశారని వారు ఆరోపించారు.

పాత అలైన్మెంట్ కొనసాగిస్తే బాగుంటుందని ఆ విధంగా త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు శుభప్రద పల్ మాట్లాడుతూ బడా రాజకీయ నాయకుల భూములు కాపాడేందుకే ప్రభుత్వం అలైన్మెంట్ మార్చిందని రైతుల జోలికిస్తే ఊరుకునే ప్రతి లేదని రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బిజెపి నాయకు లు వడ్ల నందు మాట్లాడుతూ స్వార్థ రాజకీయం కోసమే రైతులను ముంచే ప్రయత్నాలు మానుకోవాలని, వెంచర్లను కాపాడుతున్న ప్రభుత్వం రైతులను ఎందుకు పట్టించుకోవడంలేదని రైతు ల ఆవేదన ఎందుకు పట్టడం లేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగిద్ద, చంచల్పేట్, దాదాపూర్ ,యావాపూర్ , పూడూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు

Also Read: కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News