- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. ఆర్థిక సమస్యలను అధిగమించి సిఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని చెప్పారు. తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..రైతుకు మంచి రోజులు వస్తున్నాయని అన్నారు. గతేడాది మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాల్లో రూ.33 వేల కోట్లు వేశారని చెప్పారు. దేశంలోనే అత్యధిక ధాన్యం సేకరించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. అనుకున్న సమాయానికే రైతుభరోసా నిధులు వేస్తామని, అతి త్వరలోనే నల్గొండ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
- Advertisement -