Wednesday, September 10, 2025

త్రిబుల్ ఆర్ రోడ్డు వద్దు మా భూములు మాకే కావాలి

- Advertisement -
- Advertisement -

త్రిబుల్‌ ఆర్ రోడ్డు వద్దు…మా భూమలు మాకు కావాలి’ అని అంటూ నల్లగొండ జిల్లా, చౌట్టుప్పల్ మండల రైతులు సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం నాయకత్వంలో వారు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ రోడ్డు వల్ల రైతులు భూమలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేస్తే భూమికి భూమి ఇవ్వాలని, ఓపెన్ వాల్యూవేషన్‌పై నాలుగు రెట్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతులకు తెలియకుండా చేసిన అలైన్మెంట్లు రద్దు చేయాలని, రైతుల ఆమోదం లేకుండా చేయడం సరైంది కాదన్నారు. వారికి నష్టపరిహారం చెల్లించిన తరువాతనే పనులు ప్రారంభించాలని, లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ, సిపిఎం నాయకులు కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, అచ్చిన శ్రీనివాస్, పగిళ్ల శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, బండ లింగయ్య, పగిళ్ల నరసింహ, విశ్వనాథచారి, పెద్దగాని నరసింహ, హనుమంతు, పగిళ్ల శంకర్, సాయిబాబా, శంకర్, హరి, నరేష్, చిన్ననరసింహ బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు టి.శంకర్, ఇడెం కైలాసం, బిఆర్‌ఎస్ నాయకులు బాలం శ్రీను, అయితరాజు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News