Tuesday, September 9, 2025

యూరియా కోసం రైతుల పాట్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మోత్కూర్ ః యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సోమవారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. మోత్కూర్‌లోని గ్రోమోర్, ఫెర్టిలైజర్ దుకాణాలు, రైతు సేవా సహకార సంఘాలకు యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు యూరియా కోసం బారులు తీరారు. మోత్కూర్ రైతు సేవా సహకార సంఘానికి 444, మన గ్రోమోర్‌కు 444, శ్రీరామ ఫెర్టిలైజర్ 150, బాలాజీ ఫెర్టిలైజర్ 150, లక్ష్మీనరసింహ ఫెర్టిలైజర్ 70, పాటిమట్ల గ్రోమోర్ 444 యూరియా బస్తాలు వచ్చాయి, ఇప్పటికైనా అధికారులు రైతులకు కావాల్సినంత యూరియా అందించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News