Friday, July 18, 2025

యూరియా తిప్పలు… క్యూలో చెప్పులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వరంగల్‌ప్రతినిధి:యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు వర్ణనా తీతం. పత్తి పంటకు అదనులో యూరియా అందుబాటులో ఉండకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గురువారం హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో యూరియా కోసం వచ్చిన రైతులు తమ చెప్పులను క్యూలైన్‌లో పెట్టిన దృశ్యం కంటపడింది. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఒ క్కో రైతుకు రెండు బస్తాల కోసం టోకెన్ లు ఇ స్తున్నట్లు అధికారులు  ప్రకటించడంతో గ్రామాల నుంచి భారీగా రైతులు మార్కెట్‌కు వచ్చారు. రోజుల తరబడి తిరుగుతూ క్యూ లైన్లలో నిల్చున్నా యూరియా దొరక్కపోవడంతో మహిళలు, వృద్ధులు కూడా మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. క్యూ లైన్లో గంటల కొద్దీ నిల్చొని ఓపిక లేక తమ చెప్పులను వరుసలో పెట్టి పక్కన కొద్దిసేపు సేద తీరడం కనిపించింది. ఈ సందర్బంగా పలువురు రైతులు యూరియా కొరత పై మండిపడ్డారు. ప్రభుత్వానికి ముందు జాగ్రత్త తో కూడిన తగిన ప్రణాళిక లేకపోవడం వల్లే తమకు యూరియా కష్టాలు వచ్చాయని అన్నారు. ఉచిత బస్సు ఎందుకు.. పంటలకు సరిపడే యూరియా ఇవ్వాలి అని మరికొందరు మహిళా రైతులు డిమాండ్ చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News