మన తెలంగాణ /మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని సూర్య థియేటర్ దగ్గర ఉన్న యూరియా విక్రయ కేంద్రం ‘మన గ్రోమో ర్’ సెంటర్‌పై రైతులు రాళ్లతో దాడిచేశారు. వివరాల్లోకి వెళ్తే క్యూలో ఉన్న వా రికి మధ్యాహ్నం తర్వాత యూరియా బస్తాలు ఇస్తామని సిబ్బంది ఇవ్వక పో వడం, అదేవిధంగా మధ్యాహ్నం యూరియా బస్తాలు ఇస్తా మని చెప్పి పం పి ణీ చేయకపోవడంతో ఆధార్ కార్డులతో ఒకటే టోకెన్ ఇస్తూ తెలియకుండా ఇ తరులకు యూరియా బస్తాలు ఇస్తూ పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్య క్తం చేస్తూ రైతులు మన గ్రోమోర్ సెంటర్ ఎదుట కర్రలతో మంట పెట్టి ని రసన తెలిపారు. అనంతరం మన గ్రోమోర్ బోర్టును చించివేసి,
తాళాలు ప గులగొట్టి యూరియా బస్తాలను ఎత్తుకెళ్లారు. యూరియా పంపిణీ చే యాలం టూ పెద్ద పెట్టున నినాదాలతో బైఠాయించారు. సమాచారం అం దు కున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు యూరియా బస్తా లను మన గ్రోమోర్‌పై రాళ్లు విసిరి దాడి చేసిన వారిని అదుపులో తీసుకొని కేసు కూడా నమోదు చేశారు. ఒక పక్క యూరియా కోసం రైతులు రాత్రి అనకా పగలనకా లైన్‌లో వేచి ఉండి ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వచ్చిన యూరియా అక్రమంగా ఇస్తున్నారనే రైతలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని ఒక్కొక్క బస్తా ఇస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని రైతులంతా వాపోయారు. వెంటనే రైతుకు కావాల్సినంత యూరియా ఇవ్వాలని రైతుల డిమాండ్ చేశారు.