Tuesday, September 9, 2025

అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ళ జైలు శిక్ష…

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొల్కులపల్లి పంచాయితీ పరిధిలోని రాజీవ్‌నగర్ తాండకు చెందిన మేరావత్ శ్రీను అలియాస్ చరణ్ కు షాద్‌నగర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్ నగర్‌కు చెందిన మేరావత్ శ్రీను అలియాస్ చరణ్ పై మాడ్గుల పోలీస్‌స్టేషన్‌లో 2020వ సంవత్సరం జూన్ 16వ తేదీన అత్యాచారం కేసు నెం..66/2020 కింద సెక్షన్376(2), 376(3),323 ఐపీసీ అండ్ సెక్షన్‌ః 5,6 ఆఫ్ ఫోక్సో సెక్షన్ల కింద అప్పటి సీఐ సైదులు, ఎస్సై ఉపేందర్‌రావులు కేసు నమోదు చేశారు.

షాద్‌నగర్ షాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జీ ఫర్ ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ రేప్ అండ్ ఫోక్సో కేసేస్ కోర్టు జడ్జీ ఆంజనేయులు సోమవారం ఈ కేసులో ముద్దాయిగా ఉన్న మేరావత్ శ్రీను అలియాస్ చరణ్‌కు 20 ఏళ్ళ జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన సీఐ సైదులు, ఎస్సై ఉపేందర్‌రావు అడిషనల్ పీపీ శంకరాచారి, కోర్టు డ్యూటీ ఆషీసర్లు జాఫర్, నాగరాజులను సీఐ వేణుగోపాల్ ఈ సందర్భంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News