- Advertisement -
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం ఝూలవర్ ప్రాంతం ప్లిప్లోడి ప్రభుత్వ పాఠశాలలో ఘోర ప్రమాదం జరిగింది. తరగతి గది పైకప్పు కూలి నలుగురు చిన్నారులు చనిపోయారు. ఉదయం పిల్లలు తరగతులకు హాజరవ్వగా ఉన్నట్టుండి పాఠశాల భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది చిన్నారులకు గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నలుగురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలానికి రెస్య్కూ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి, చిన్నారులను బయటకు తీయడానికి స్థానికులకు రెస్య్కూ సిబ్బంది సహాయ పడుతున్నారు. గతంలో పాఠశాల శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం నిర్మించాలని గ్రామస్థులు మొరపెట్టుకున్న ఉన్నతాధికారులు, ఎంఎల్ఎ, ప్రజాప్రతినిధులకు పట్టించుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు.
- Advertisement -