Thursday, September 4, 2025

ఆన్‌లైన్‌ గేమ్ ఎంత పని చేసింది.. కత్తులతో దాడి చేసుకున్న తండ్రి, కొడుకు

- Advertisement -
- Advertisement -

తండ్రికొడుకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తరచూ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి అప్పులు చేసిన కుమారుడు(37).. వాటిని చెల్లించాలని తండ్రిపై ఒత్తిడి చేశాడు. అయితే, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కన్న తండ్రిపై కొడుకు దాడికి దిగాడు. దీంతో కోపంతో రగిలిపోయిన తండ్రి కూడా ఎదురుదాడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కత్తులతో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో తండ్రికొడుకులు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇద్దరినీ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News