మన తెలంగాణ/మోతె: భూ వివాదంలో తండ్రిని తనయుడు హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని నాగయ్య గూడెంలో బుధవారం చోటు చసుకుంది. పోలీసులు తెలిపిన విరాల ప్రకారం నాగయ్య గూడెం గ్రామానికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న(50) టీవీఎస్ ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా కుమారుడు గంగయ్య మామిల్లగూడెం బ్రిడ్జి కింద కాపు కాచి ద్విచక్ర వాహనంపై తండ్రిని వెంబడిస్తూ మామిల్లగూడెం, విబులాపురం గ్రామాల మధ్యకు రాగానే అతనిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేయడంతో వెంకన్నకు తల, మెడ, చాతి పైన గొడ్డలితో తీవ్రంగా గాయాలు చేయడంతో, చికిత్స కోసం 108లో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా వెంకన్న మృతి చెందాడు. వెంకన్నకు ఇద్దరు కొడుకులతోపాటు కూతురు ఉన్నది. మృతుడికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇద్దరు కొడుకులకు మూడు ఎకరాలు పంచి ఇచ్చాడు. ఒక ఎకరం తన పేరు మీద ఉంచుకున్నాడు.
గత కొంతకాలంగా ఎకరం ఎకరాలు పంచి ఇచ్చాడు. ఒక ఎకరం తన పేరు మీద ఉంచుకున్నాడు. గత కొంతకాలంగా ఎకరం భూమి కూడా ఇవ్వాలని తండ్రి కొడుకుల మధ్య వివాదం జరుగుతున్నట్లు తెలిసింది. ఈ భూమి విషయంలో గతంలో గంగయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఎకరం భూమి కూతురు సరితకు తండ్రి రిజిస్ట్రేషన్ చేయించాడు. అప్పటినుంచి కక్ష పెంచుకున్న కుమారుడు తండ్రి పై దాడి చేసి హత్య చేశాడు. హత్య చేసిన నిందితుడు వెంటనే పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. మృతుడి కూతురు సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్త్స్ర యాదవేందర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.