Saturday, July 5, 2025

తండ్రిని హత్య చేసిన కేసులో కుమారుడికి రిమాండ్

- Advertisement -
- Advertisement -

తండ్రి, కుమారుల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న భూ వివాదం కారణంగా కన్నతండ్రిని హత్య చేసిన కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి నరసింహ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న మోతె మండలం, నాగయ్యగూడెం గ్రామానికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న (60)ను సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం గ్రామ శివారులో అతని కుమారుడు నిమ్మరబోయిన గంగయ్య కాపుకాసి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. భూమి సంబంధిత తగాదా విషయమై తండ్రి, కుమారులకు మధ్య గత కొద్ది నెలలుగా వివాదం జరుగుతోందని, ఈ కారణంగానే పథకం ప్రకారం తండ్రిని హత్య చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మామిళ్లగూడెం ఎక్స్ రోడ్డు వద్ద హత్యకు పాల్పడిన నిందితుడు నిమ్మరబోయిన గంగయ్యను మోతె ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో చురుకుగా పనిచేసిన మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని, కేసును పర్యవేక్షించిన డిఎస్‌పి శ్రీధర్ రెడ్డిని జిల్లా ఎస్‌పి అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్‌పి, మునగాల సిఐ, మోతె ఎస్‌ఐ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News