- Advertisement -
వనపర్తి జిల్లా, మరికల్ మండల పరిధిలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురుపై తండ్రి అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన అతని భార్య పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో భర్త పరారీ అయ్యాడు. ఎస్‌ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 26న ఇంట్లో ఉన్న కూతురు హోంవర్క్ చేస్తుండగా ఎవరూ లేని సమయంలో తాగిన మైకంలో బాలికపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుమార్తెకు రక్తస్రావం కావడంతో తల్లి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షలో అత్యాచారం జరిగినట్టు ధృవీకరించారు. ఈ సంఘటనపై భర్తపై భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాగా అత్యాచారానికి పాల్పడిన తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
- Advertisement -