శాన్ జోక్విన్ కౌంటీలో ఒక ముఠా కిడ్నాప్ కు సంబంధించిన కేసులో అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్ బిఐ) 8 మంది ఖలిస్తానీ టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసింది. వారిలో భారతదేశానికి చెందిననేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ పవిట్టర్ సింగ్ బటాలా కూడ్ ఉన్నారు. నిషేధిత టెర్రరిస్ట్ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో సంబంధం ఉన్న వ్యక్తి పవిట్టర్ సింగ్ బటాలా. పలు టెర్రరిస్ట్ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు అతడిని భారతదేశం లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. శాన్ జోక్విన్ కౌంటీలో కిడ్నాప్, హింసాత్మక చర్యలతో వేధించిన కేసులో ఎఫ్ బిఐ శుక్రవారం నాడు అమెరికాలోని పలు ప్రాంతాలలో దాదాపు 8 మందిని అరెస్ట్ చేసినట్లు షెరీఫ్ కార్యాలయం తెలిపింది. 2025 జూలై 11నముఠా సంబంధిత కిడ్నాప్, చిత్రహింసల దర్యాప్తులో భాగంగా శాన్ జోక్విన్ కౌంటీ అంతటా, ఐదు దర్యాప్తు సంస్థలు సమన్వయంతోవారెంట్ లను అమలు చేశాయి.
ఆ సంస్థలలో కౌంటీ షెరీఫ్ ఆఫీస్ ఏజెంట్ యూనిట్, స్టాక్టన్ పోలీసు డిపార్ట్ మెంట్ స్వాట్ చీమ్, మాంటెకా పోలీస్ డిపార్ట్ మెంట్ స్వాట్ టీమ్, సా్‌టనిస్టాన్ కౌంటీ షెరీప్ ఆఫీస్ టీమ్, ఎఫ్ బీఐ స్వాట్ టీమ్ ఉన్నాయి.బటాలా తో పాటు, అరెస్ట్ అయిన వారిలో దిల్ ప్రీత్ సింగ్, అమృత్ పాల్ సింగ్, అర్ష్ ప్రీత్ సింగ్, మన్ ప్రీత్ రంధావా, సరబ్ జిత్ సింగ్, గుర్తాజ్ సింగ్ , విశాల్ అనే వ్యక్తి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.నిందితులలో కిడ్నాప్, హింస, అక్రమ నిర్బంధం, సాక్షులను బెదిరించడం, సెమీ ఆటోమేటిక్ తుపాకీతో దాడి, వంటి ఆరోపణలు ఉన్నాయి. వారిని శాన్ జోక్విన్ కౌంటీ జైలుకు పంపారు. వారివద్ద మెషిన్ గన్, రిజిస్టర్ చేయని లోడ్ చేసిన హ్యాండ్ గన్ దొరికాయి. తనిఖీలో ఆరు తుపాకులు, పూర్తిగా ఆటో మేటిక్ గ్లోక్ తో సహా వందలాది రౌండ్ల తూటాలు అధిక సామర్థ్యం గల మ్యాగజైన్లు, 15వేల అమెరికా డాలర్లు స్వాధీనం చేసుకున్నారు.